'విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తే చర్యలు'

'విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తే చర్యలు'

అన్నమయ్య: సచివాలయ సిబ్బంది విధి నిర్వహణలో నిర్లక్ష్యం చూపితే చర్యలు తప్పవని ఎంపీడీవో భాను ప్రసాద్ హెచ్చరించారు. శుక్రవారం గుడిబండ సచివాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. రికార్డులు తనిఖీ చేసి సిబ్బంది పనితీరును ఆరా తీశారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి సమస్యలపై సకాలంలో స్పందించాలన్నారు. అనంతరం ప్రజలకు వాట్సాప్ గవర్నన్స్ పై అవగాహన కల్పించారు.