బీసీ హాస్టల్స్‌లో తనిఖీ చేసిన ఎంపీడీవో
SDPT: జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు బెజ్జంకి మండలంలోని బీసీ హాస్టల్‌ను ఎంపీడీవో కడవెర్గు ప్రవీణ్ పరిశీలించారు. హాస్టల్‌లో ఆహార నాణ్యత, సౌకర్యాలు, పరిశుభ్రత, భద్రతపై సమీక్షించారు. బాత్రూంలలో తగిన నీటి వసతి కల్పించాలని సిబ్బందికి సూచించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని తెలిపారు.