నేడు పలు ఐటీ సంస్థలకు భూమిపూజ
AP: విశాఖలో నేడు పలు ఐటీ సంస్థలకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ భూమి పూజ చేయనున్నారు. కాగ్నిజెంట్, సత్వా గ్రూప్, టెక్ తమ్మిన, నాన్ రెల్ టెక్నాలజీస్, ఇమాజిన్నోవేట్ టెక్ సొల్యూషన్స్, ఫ్లూయెంట్ గ్రిడ్ లిమిటెడ్, మదర్సన్ టెక్నాలజీ, క్వార్క్స్ టెక్నో సాఫ్ట్, ఏసీఎన్ ఇన్ఫోటెక్ సంస్థలకు శంకుస్థాపన చేయనున్నారు. 12 నెలల్లో ఈ భవనాల నిర్మాణాలు పూర్తికానున్నాయి.