గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకుడు మృతి
JN: రఘునాథ్ పెల్లి మండల కేంద్రంలో జాతీయ రహదారిపై ఇవాళ బైక్‌పై వెళ్తున్న రాపాక వినోద్, బిర్రు రవి అనే ఇద్దరు యువకులను గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వినోద్ అక్కడికక్కడే మృతి చెందాడు, రవికి తీవ్ర గాయాలు కావడంతో ఎంజీఎంకు తరలించారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వీరి స్వగ్రామం వర్ధన్నపేట మండలం నల్లబెల్లి గ్రామంకు చెందిన వారు గుర్తించారు.