పేదలకు ఉచిత వినికిడి యంత్రాల పంపిణీ
ATP: అనంతపురం ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ తన అంబికా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వినికిడి యంత్రాలను పంపిణీ చేశారు. ఓఎన్‌జీసీ నిధులతో 130 మందికి ఆధునిక యంత్రాలు, 10 మందికి ట్రై సైకిళ్లు అందజేశారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎంపీ తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు.