భగత్ సింగ్ కాలనీలో కార్డన్ అండ్ సెర్చ్
CTR: పుంగనూరు భగత్ సింగ్ కాలనీలో పోలీసులు ఇవాళ ఉదయం కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. సుమారు 50 మంది పోలీసు సిబ్బంది బృందాలుగా విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. అనుమానిత వ్యక్తుల వివరాలు సేకరించడంతోపాటు, పలు వాహనాల రికార్డులను పరిశీలించారు. ఇళ్లకు అద్దెకిచ్చే వారి వివరాలు పూర్తిగా తెలుసుకోవాలని, అనుమానితులు సంచరిస్తే సమాచారం ఇవ్వాలని సీఐ సుబ్బారాయుడు తెలిపారు.