VIDEO: సింహాచలంలో కమనీయంగా 'గరుడ సేవ'
VSP: సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో సోమవారం 'గరుడ సేవ' నేత్రపర్వంగా సాగింది. కళ్యాణ మండపంలో ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని అధిష్టింపజేసి, పాంచరాత్రాగమ శాస్త్రోక్తంగా అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. ఈ ఆర్జిత సేవలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకోగా, వారికి వేదాశీర్వచనాలు, శేషవస్త్రాలు, ప్రసాదాలను అందజేశారు.