అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యం పట్టివేత

అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యం పట్టివేత

ASF: వాంకిడి మండలం బెండార గ్రామంలో ఎన్ఫోర్స్‌మెంట్ DTలు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సుమారు 8.39 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం అక్రమంగా నిల్వ చేసినట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. శంకర్, అర్జున్ అనే వ్యక్తులు అక్రమంగా కొనుగోలు చేసి దాచినట్లు తెలిపారు. వారిపై 6-A కేసు నమోదు చేసి తదుపరి చర్యల కోసం పై అధికారులకు నివేదిక సమర్పించామన్నారు.