విజయవాడలో భారీగా నగదు స్వాధీనం..!
కృష్ణా: ఢిల్లీలో పేలుళ్ల నేపథ్యంలో పోలీసులు సోమవారం రాత్రి విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. వాహనాలు, లాడ్జీలు, కాలనీల్లో జల్లెడ పట్టారు. మొగల్రాజపురం వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా రూ. 75 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. నగదుకు సరైన ఆధారాలు చూపించకపోవడంతో కేసు నమోదు చేసినట్లు ఏసీపీ దామోదర్ తెలిపారు. అనుమానస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.