'విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి'

NLG: విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని MCLచారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధి మంచికంటి వెంకటరమణ అన్నారు.79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా చండూర్ మండలం బోడంగిపర్తి మంచికంటి గోపమ్మ స్మారక జిల్లా పరిషత్ ఉన్నత, ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు నిర్వహించిన ఆటల పోటీల్లో గెలుపొందిన వారికి శుక్రవారం రూ.20 వేల విలువైన బహుమతులను ప్రదానం చేశారు.