ఖమ్మం ఆలయంలో ఉసిరికాయలతో భక్తి దీపారాధన

ఖమ్మం ఆలయంలో ఉసిరికాయలతో భక్తి దీపారాధన

ఖమ్మం నగరంలోని బ్రాహ్మణ బజార్‌లో గల శ్రీ భ్రమరాంబ సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ఆఖరి సోమవారం రోజున భక్తులు శివయ్యకు ఉసిరికాయలతో దీపారాధనలు చేశారు. తెల్లవారుజామున 3 గంటలకు ఆలయ అర్చకులు మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం నిర్వహించారు. భక్తులు "ఓం నమశ్శివాయ హరహర మహదేవ శంభో శంకర" అంటూ భక్తిలో మునిగిపోయారు.