'ఉపాధి కూలీలు సమయపాలన పాటించాలి'

ADB: ఉపాధి హామీ కూలీలు ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని సమయపాలన పాటించాలని బోథ్ ఎంపీడీవో రమేశ్ సూచించారు. శుక్రవారం కుచులాపూర్ శివారులో కొనసాగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించారు. ఉదయం 11 గంటల లోపు పనులు పూర్తయ్యేలా చూడాలని సూచించారు. CCT పనులకు సంబంధించిన కొలతలు తీసుకున్నారు. కూలీల అటెండెన్స్ రిజిస్టర్లను పరిశీలించారు.