ఏఎస్సైని సన్మానించి రోటరీ క్లబ్
VZM: కొత్త సుంకరపాలెం దత్తుడుబంధ చెరువులో గుర్తు తెలియని మృతదేహం తేలుతున్నట్టు కొత్తవలస సీఐకు సమాచారం వచ్చింది. సిబ్బందిని పంపించి చూడగా స్థానికులు శవాన్ని తీయడానికి సహకరించకపోవడంతో ఏఎస్సై జనార్ధనరావు అధిక వర్షాన్ని సైతం లెక్కచేయకుండా స్వయంగా చెరువులో దిగి శవాన్ని బయటకు తీశారు. అతని ధైర్య సాహసాలు ప్రదర్శించినందుకు రోటరీ క్లబ్ ఆయనను సన్మానించారు.