గోరంట్లలో టీడీపీ సీనియర్ నాయకుడు మృతి
సత్యసాయి: గోరంట్ల మేజర్ పంచాయతీలో టీడీపీ సీనియర్ నాయకుడు కుమ్మరి హనుమంతప్ప ఆదివారం మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న హిందూపురం మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప వారి స్వగృహనికి వెళ్లి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో గోరంట్ల మాజీ సర్పంచ్ నిమ్మల చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.