రేషన్ బియ్యం దుర్వినియోగంపై ముగ్గురిపై కేసు
NLR: ఉదయగిరి సివిల్ సప్లై గోదాం నుంచి రేషన్ బియ్యం పక్కదారి పట్టిన వ్యవహారంలో ముగ్గురిపై కేసు నమోదు అయినట్లు ఎస్సై కర్నాటి ఇంద్రసేనారెడ్డి వెల్లడించారు. జిల్లా పౌరసరఫరాల శాఖ మేనేజర్ అర్జున్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా టెక్నికల్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, సెక్యూరిటీ గార్డులపై కేసు దాఖలు చేసి పూర్తి దర్యాప్తు ప్రారంభించామని చెప్పారు.