వీర్నపల్లి కంచర్ల అడవుల్లో పులి సంచారం కలకలం
SRCL: రాజన్న సిరిసిల్ల జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లో పులి సంచారం కలకలం రేపుతోంది. వీర్నాపల్లి, జినిగాల, భీమ్ నగర్, గరిగేపాటి ప్రాంతాల్లో పులి సంచరిస్తున్నట్లు సిరికొండ అటవీ శాఖ అధికారి నర్సింగ్ రావు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అడవుల సమీప గ్రామాల్లో రాత్రిపూట పొలాలకు వెళ్లవద్దని, పశువులపై దాడి జరిగితే వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాలని సూచించారు.