గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు అరెస్ట్

GDWL: మహారాష్ట్రలోని సోలాపూర్ నుంచి గంజాయిని కొనుగోలు చేసి, గద్వాల, అయిజ పట్టణాల్లో యువతకు అమ్ముతున్న ముగ్గురు నిందితులను మంగళవారం గద్వాల పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 1.65 కిలోల గంజాయి మరియు మూడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. రైల్వే స్టేషన్ వద్ద నిఘా ఉంచి, ఎస్సై కళ్యాణ్ వీరిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు.