నకిరేకల్‌లో బీజేపీ నాయకుల అరెస్ట్

NLG: సెక్రటేరియట్ ముట్టడికి వెళ్లకుండా నకిరేకల్‌కు చెందిన బీజేపీ నాయకులను నకిరేకల్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ప్రభుత్వం ఎక్కడికక్కడ నిర్బంధాలు, అరెస్టులు అక్రమ కేసులు బనాయిస్తూ ఇబ్బందులకు గురిచేస్తుందని బీజేపీ జిల్లా నాయకులు పల్స శ్రీను పేర్కొన్నారు. అరెస్టు అయిన వారిలో డాకయ్య, మురళి, కాడింగు నాగరాజు, గట్టు శ్రీకాంత్, యాదగిరి ఉన్నారు.