'పీఎం విశ్వకర్మ పథకాన్ని వినియోగించుకోవాలి'
ములుగు జిల్లా కేంద్రంలోని సంక్షేమ భవన్‌లో పీఎం విశ్వకర్మ పథకంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ సిద్ధార్థ రెడ్డి మాట్లాడుతూ.. సంప్రదాయ వృత్తిదారులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వడ్రంగులు, కంసాలులు, దర్జీలు తదితర వృత్తిదారులకు శిక్షణ ఇచ్చి, తక్కువ వడ్డీతో రూ.1 లక్ష వరకు రుణం అందిస్తామన్నారు.