ఆకట్టుకున్న సినీ నటుడు సోనూసూద్ చిత్రం

SKLM: శ్రీకాకుళం నగరానికి చెందిన చిత్రకారుడు దాకోజు లాల్ సినీ నటుడు సోనూసూద్‌పై తన అభిమానాన్ని చాటుకున్నాడు. సోనూసూద్ పుట్టినరోజు సందర్భంగా కరెన్సీ నోట్లు, కాయిన్లతో ఆయన చిత్రాన్ని రూపొందించాడు. రూ.500, రూ.200 నోట్లతోపాటు రూ.10, 5, 1, 2 కాయిన్ల వినియోగించామన్నారు. సోనూసూద్ మంచి మానవతావాది అని, సహాయం చేయాలంటే ఆయన ముందుంటారని కొనియడారు.