విద్యుత్ సరఫరాకు అంతరాయం
W.G: ఉండి మండలంలోని విద్యుత్ ఉపకేంద్రంలో ఫీడర్ల వద్ద చెట్ల కొమ్మల తొలగింపు దృష్ట్యా బుధవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనుందని ఈఈ వెంకటేశ్వరరావు తెలిపారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉండి రోడ్, గోరింతోట, పెదపుల్లేరు, చినపుల్లేరు, కలిసిపూడి, చెరుకువాడ గ్రామాల్లో సరఫరా ఉండదని పేర్కొన్నారు. వినియోగదారులు సహకరించాలన్నారు.