ఆస్పత్రిలో బాత్రూమ్ కిటికీ నుంచి పరారైన దొంగ

ఆస్పత్రిలో బాత్రూమ్ కిటికీ నుంచి పరారైన దొంగ

TG: హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రి నుంచి సోహెల్ అనే దొంగ పరారయ్యాడు. దొంగతనం కేసులో అరెస్టయిన అతడిని రిమాండ్ కోసం తరలించే ముందు వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆ సమయంలో బాత్రూమ్ కిటికీని తొలగించి సోహెల్ తప్పించుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారైన దొంగ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.