VIDEO: కమిషనరేట్‌లో కుంభకోణం.. ఐదుగురు అరెస్ట్
కరీంనగర్ పోలీస్ కమిషనరేట్‌లో జీతాల కుంభకోణం కేసులో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో చిగురుమామిడి హెడ్ కానిస్టేబుల్ నీలం రామ్మోహన్, రిటైర్డ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మునిరామయ్య ఉన్నారు. ఐదుగురిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. వారి నుంచి 341 గ్రాముల బంగారం, రూ.50 వేల నగదు స్వాధీనం చేసుకున్నామని సీఎం గౌస్ ఆలం తెలిపారు.