'రహదారికి మరమ్మత్తులు చేపట్టాలి'

'రహదారికి మరమ్మత్తులు చేపట్టాలి'

KMM: మధిర మండల పరిధిలోని, దెందుకూరు నుంచి మీనవోలు వెళ్లే ప్రధాన రహదారి గుంతలమయంగా మారి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్రయాణికులు తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాలకు రహదారిపై గుంతలు ఏర్పడి ప్రమాదాల బారిన పడుతున్నామని వాపోయారు. సంబంధిత అధికారులు స్పందించి రహదారికి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.