VIDEO: ఈనెల 11న మాదిగల ఆత్మీయ సమావేశం
కోనసీమ: ఈనెల 11న అమలాపురం పట్టణం కొంకాపల్లి సత్తెమ్మ తల్లి ఆలయం వద్ద జరిగే మాదిగల ఆత్మీయ కలయికను విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ కోరారు. అమలాపురంలో సోమవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మాదిగల పొలిటికల్ జేఏసీ, అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో మాదిగల ఆత్మీయ కలయిక 4వ వార్షికోత్సవం రాజకీయాలకు అతీతంగా నిర్వహిస్తున్నామన్నారు.