అధికారులు సమన్వయంతో పని చేయాలి: మంత్రి ఉత్తమ్

అధికారులు సమన్వయంతో పని చేయాలి: మంత్రి ఉత్తమ్

SRPT: భారీ వర్షాల నేపథ్యంలో హుజూర్ నగర్ ఎమ్మెల్యే, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అలసత్వం వద్దని హెచ్చరించారు. ప్రాజెక్టుల వద్ద 24 గంటలు పహారా పెట్టాలని ఆదేశించారు. సిబ్బంది 72 గంటలు ఆయా కేంద్రాలలో ఉండాలన్నారు. రెవెన్యూ, పోలీస్ అధికారులు సమన్వయం చేసుకోవాలని సూచించారు.