కొడుకుని కొట్టాడని స్కూల్‌కు తాళం వేసిన తండ్రి

కొడుకుని కొట్టాడని స్కూల్‌కు తాళం వేసిన తండ్రి

కాకినాడ జిల్లా ఉప్పాడ కొత్తపల్లి ప్రభుత్వ పాఠశాలలో షాకింగ్ ఘటన జరిగింది. ఆరో తరగతి చదువుతున్న తన కుమారుడిని పదో తరగతి విద్యార్థి కొట్టాడని భాషా అనే వ్యక్తి స్కూల్‌కు తాళం వేసి, ఇంటికెళ్లిపోయాడు. దీంతో 500 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు లోపలే ఉండిపోయారు. టీచర్లు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంబంధిత వ్యక్తిని తీసుకొచ్చి తాళాలు తీయించి, అతడిని హెచ్చరించారు.