ఫైర్ సేఫ్టీ తనిఖీలు.. 6 షాపులు సీజ్
HYD: అగ్ని ప్రమాదాల నేపథ్యంలో ఫైర్ సేఫ్టీపై రెండో రోజూ తనిఖీలు కొనసాగాయి. GHMC, HYDRA, ఫైర్, విద్యుత్ శాఖల అధికారులు సంయుక్తంగా గచ్చిబౌలి లాంటి చోట్ల తనిఖీలు నిర్వహించారు. ఫైర్ నిబంధనలను పాటించని షాపులపై కఠిన చర్యలు తీసుకుంటూ 6 షాపులను సీజ్ చేశారు. సెల్లార్లను గోదాములుగా మార్చడం, కెమికల్, పెయింట్ డబ్బాలు నిల్వ చేయొద్దన్నారు.