VIDEO: ఉంగుటూరు-లంకపల్లి రహదారికి మోక్షం
కృష్ణా: ఉంగుటూరు-లంకపల్లి మధ్య బుడమేరు సమీపంలో ఎట్టకేలకు రహదారి మరమ్మతు పనులు ప్రారంభమయ్యాయి. కొంతకాలంగా రోడ్డు ఛిన్నాభిన్నం కావడంతో వాహనదారులు పడుతున్న అవస్థలపై అధికారులు స్పందించి పునరుద్ధరణ పనులు చేపట్టారు. ఈ పనులు పూర్తయితే రాకపోకలు సాఫీగా సాగుతాయని అధికారులు పేర్కొన్నారు. పనులు జరుగుతున్న నేపథ్యంలో ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.