'కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో హైకోర్టు తీర్పుని గౌరవిస్తున్నాం'
ADB: కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని మాజీ మంత్రి జోగు రామన్న తెలిపారు. స్థానిక BRS పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండించారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు స్పష్టంగా ఆదేశించడం జరిగిందని తెలిపారు.