'ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'
NRML: సారంగాపూర్ మండలం స్వర్ణ ప్రాజెక్టు పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సోమవారం ఉదయం ప్రకటనలో తెలిపారు. భారీ వర్షాలు పడుతున్నందున ఈరోజు ఎప్పుడైనా గేట్లు ఎత్తివేసే అవకాశం ఉందని, దిగువ ప్రాంత ప్రజలు అప్రవత్తంగా ఉండాలని, పశువుల కాపలాదారులు, రైతులు, జాలరులు అటువైపుగా వెళ్ళవద్దని సూచించారు.