'ఏజెన్సీ భూములపై ఆదివాసీలకే హక్కు ఉంది'
MHBD: కొత్తగూడ మండలంలో ఇవాళ తుడుం దెబ్బ మండల అధ్యక్షుడు సందీప్ అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు వెంకటరత్నం మాట్లాడుతూ.. 5వ షెడ్యూల్ ప్రాంతంలో భూములపై పూర్తి హక్కులు ఆదివాసీలకే ఉన్నాయని స్పష్టం చేశారు. గిరిజనేతరులు రాజకీయ ముసుగులో 1/70 పేసా చట్టాలను ఉల్లంఘిస్తూ భూములు కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. అధికారులు స్పందించాలని కోరారు.