మున్సిపల్ ఎన్నికలు.. పోలీసుల తనిఖీ
MDCL: మున్సిపల్ ఎన్నికలు, శాంతి భద్రతల పరిరక్షణ కోసం మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలో విస్తృత బందోబస్తు ఏర్పాటు చేసినట్లు మేడ్చల్ ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ తెలిపారు. ఇవాళ ఎల్లంపే, రావల్కోల్, రాజబొల్లారం తండా ప్రాంతాల్లో పోలీస్ సిబ్బంది, జోనల్ ఫోర్స్‌తో కలిసి వాహనాల తనిఖీలు, ఫుట్ ప్యాట్రోలింగ్ నిర్వహించారు. అనుమానాస్పద కదలికల పై నిఘా పెంచినట్లు పేర్కొన్నారు.