కరెంట్ షాక్‌కు గురైన విద్యార్థులను పరామర్శించిన ఎమ్మెల్యే

MHBD: కేంద్రంలోని పత్తిపాక ఆశ్రమ పాఠశాలలో విద్యుత్ షాక్‌తో స్వల్పంగా గాయపడిన ముగ్గురు విద్యార్థులను ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే మురళి నాయక్ బుధవారం పరామర్శించారు. ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు సరైన వైద్యం అందించాలని వైద్య అధికారులను ఆదేశించారు