VIDEO: కనకమహాలక్ష్మి ఆలయంలో వీణానాద మధురిమ
విశాఖలోని కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో నిర్వహించిన వీణావాదన సేవ భక్తులను మంత్రముగ్ధులను చేసింది. అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన 'వీణావాదన సేవ'ను అత్యంత వైభవంగా నిర్వహించారు. సుమారు వంద మంది వీణ వైదుష్య శిరోమణులు, నారీమణులు ఏకధాటిగా వీణ వాయిస్తూ అమ్మవారికి స్వరార్చన గావించారు.