డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ఒకరికి జైలు శిక్ష
KMR: మద్యం సేవించి వాహనం నడిపినందుకు మెదక్ జిల్లా శమనాపూర్ గ్రామానికి చెందిన ధనరాజుకు ఒక రోజు జైలు శిక్ష పడిందని సోమవారం బిక్కనూర్ ఎస్సై ఆంజనేయులు తెలిపారు. ధనరాజుపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా, సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ చంద్రశేఖర్ అతనికి రూ. 1000 జరిమానా తో పాటు ఒక రోజు జైలు శిక్షను విధించినట్లు ఎస్సై వివరించారు.