VIDEO: అక్రమ తవ్వకాలు.. రైతుల ఆవేదన
WGL: పర్వతగిరి మండల కేంద్రంలోని పర్వతాల శివాలయం వెనుక అక్రమంగా మట్టి తవ్వకాలు కొనసాగుతున్నాయి. టిప్పర్ల ద్వారా మట్టిని తరలించడంతో రైతుల పొలాలకు వెళ్లే దారి ధ్వంసమవుతోందని ఆదివారం రైతులు ఆరోపించారు. పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ.. తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.