మద్నూర్‌లో వైభవంగా ప్రభాత్ ఫేరి గ్రామ ప్రదక్షిణ
KMR: మద్నూర్‌లో కార్తీక మాసం ప్రభాత్ ఫేరి బృందం సభ్యులు ఇవాళ తెల్లవారుజామున భజనలతో గ్రామ ప్రదక్షిణ చేశారు. బాలాజీ మందిరం నుంచి ప్రారంభమై పాత బస్టాండ్, హౌసింగ్ బోర్డు కాలనీ, రథంగల్లి, ఎల్లమ్మ గల్లి, పోచమ్మ గల్లి, మార్వాడీ వాడ నుంచి ప్రదక్షిణ చేసినట్లు పూజారి సంగయప్ప, శంకరప్ప తెలిపారు. గత 90 సంవత్సరాలుగా సాంప్రదాయం కొనసాగుతుందన్నారు.