VIDEO: నగరంలోని రౌడీషీటర్లకు డ్రగ్ టెస్టులు
హైదరాబాద్ కమిషరేట్ పరిధిలో రౌడీషీటర్లకు పోలీసులు డ్రగ్ టెస్టులు చేశారు. నగరంలో రౌడీషీటర్ల ఆగడాలు పెరగడంతో పోలీసులు ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. నగరంలో ప్రస్తుతం 1,300 మందికి పైగా రౌడీషీటర్లు ఉండగా వీరిలో 250 మందికిపైగా డ్రగ్ టెస్టులు చేశారు. ఇందులో 190 మందికి గంజాయి పాజిటివ్ వచ్చినట్లు వారు తెలిపారు.