పరీక్షా కేంద్రాలను పర్యవేక్షించిన ఎంఈవో

పరీక్షా కేంద్రాలను పర్యవేక్షించిన ఎంఈవో

శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో సమ్మేటివ్ అసెస్‌మెంట్-2 పరీక్షలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పరీక్షా కేంద్రాలను ఎంఈవో బమ్మడి మాధవరావు గురువారం పర్యవేక్షించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రశ్నాపత్రాల ఆధారంగా విద్యార్థులకు జవాబులు ఎలా రాయాలో ఉపాధ్యాయులు వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.