తప్పిపోయిన బాలిక ఆచూకీ లభ్యం
PLD: నరసరావుపేటలో 4 ఏళ్ల ఎస్తేరు ఇంటి వద్ద ఆడుకుంటూ గురువారం కనిపించకుండా పోయింది. తల్లిదండ్రులు వెతికినా కనబడకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు వెంటనే మహిళా ఎస్సైల ఆధ్వర్యంలో బృందం గాలింపు నిర్వహించింది. కొద్ది సమయంలోనే శిశుమందిర్ స్కూల్ వద్ద బాలికను గుర్తించి తల్లికి అప్పగించారు. దీంతో కుటుంబం పోలీసులకు కృతజ్ఞతలు తెలిపింది.