వరద పోటెత్తడంతో మూడు గేట్లు ఎత్తివేసిన అధికారులు

RR: రాజేంద్రనగర్ పరిధిలోని ఆరంగర్, శంషాబాద్,తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో హిమాయత్ సాగర్‌కు వరద పోటెత్తింది. అప్రమత్తమైన జలమండలి అధికారులు 3 గేట్లు ఎత్తివేశారు. మూసీనదిలోకి భారీగా వరద నీరు ప్రవహిస్తుంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.