'పారాది కాజ్‌వే మరమ్మతులకు నిదులు మంజూరు'
VZM: ఇటీవల కురిసిన భారీ వర్షాలతో పారాది కాజ్‌వే పూర్తిగా పాడైపోయి వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో ప్రజలకు అసౌకర్యం కలుగకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న స్దానిక MLA బేబినాయన శుక్రవారం జిల్లా కలెక్టర్ ఎస్.రామసుందర్ రెడ్డిని కలసి మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలని కోరారు. స్పందించిన కలెక్టర్ రూ.12 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు.