చెరువును పరిశీలించిన తహసీల్దార్

WGL: పర్వతగిరి మండలం వడ్లకొండ గ్రామంలోని ఊర చెరువు కట్ట ప్రమాదకరంగా ఉండటంతో మరమ్మతు పనులను ఆదివారం తహశీల్దార్ వెంకటస్వామి పరిశీలించారు. చెరువుకు ఇసుక బస్తాలను వేసి కట్ట ఎత్తు పెంచారు. చెరువు వద్దకు వెళ్లకూడదని గ్రామస్తులకు సూచించారు. కార్యక్రమంలో గ్రామస్తులు అత్తి కుమారస్వామి, వల్లందాస్ రంగయ్య, రవీందర్, జుట్టుకొండ రమేశ్, తదితరులు పాల్గొన్నారు.