పొట్టి శ్రీరాములు చిత్రపటానికి నివాళులర్పించిన కలెక్టర్

పొట్టి శ్రీరాములు చిత్రపటానికి నివాళులర్పించిన కలెక్టర్

కృష్ణా: అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా మచిలీపట్నం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పొట్టి శ్రీరాములు చిత్రపటానికి కలెక్టర్ బాలాజీ సోమవారం పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పొట్టి శ్రీరాములు త్యాగాలను కలెక్టర్ స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్‌తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.