VIDEO: కళ్యాణానికి ముస్తాబవుతున్న ఆలయాలు
KNR: రేపు శ్రీ రామ నవమి పురస్కరించుకొని గంగాధర మండలంలోని పలు ఆలయాలను వైభవంగా ముస్తాబు చేస్తున్నారు. సీతారాముల కల్యాణాన్ని నిర్వహించేందుకు ఆలయ నిర్వాహకులు ఆలయాలను అలంకరిస్తున్నారు. ఆలయాలకు రంగులు వేసి, విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. సీతారాముల కల్యాణం అనంతరం సాయంత్రం స్థానిక పురవీధుల్లో పల్లకిలో స్వామి సేవ ఉంటుందన్నారు.