VIDEO: ఉదృతంగా ప్రవహిస్తున్న గోదావరి
NRML: సోన్ గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. గత కొంతకాలంగా ఎగువ ప్రాంతంలో భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో ప్రాజెక్టుల గేట్లు వదలడంతో శనివారం గోదావరి నది ఉప్పొంగుతుంది. గోదావరి పుష్కరాల కోసం ఏర్పాటుచేసిన ఘట్ల వరకు నీరు ప్రవహిస్తోంది. గోదావరి నది ఉదృతంగా ప్రవహిస్తుండడంతో గోదావరికి వెళ్లే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.