కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే
PDPL: పాలకుర్తి మండలం గుంటూరు పల్లిలో రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ ఇవాళ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల పంటను ప్రభుత్వం మద్దతు ధరకు, ఎలాంటి కోతలు లేకుండా కొంటుందని తెలిపారు. కేంద్రాల వద్ద అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట ప్రజా ప్రతినిధులు, అధికారులు ఉన్నారు.