దుబ్బాకలో ఘనంగా శతాబ్ది పుట్టినరోజు వేడుకలు

దుబ్బాకలో ఘనంగా శతాబ్ది పుట్టినరోజు వేడుకలు

SDPT: దుబ్బాక మండలం రాజక్కపేట గ్రామానికి చెందిన చోల్లేటి శంకరయ్య 100వ పుట్టినరోజు జరుపుకున్నారు. శంకరయ్యకు ఒక కుమారుడు, నలుగురు కుమార్తెలు ఉండగా, మొత్తం కుటుంబ సభ్యులు సుమారు 50 మంది ఒకచోట చేరి గ్రామంలో శతజయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆనందంగా వేడుకల్లో పాల్గొన్నారు.