వర్ధన్నపేట‌లో క్షుద్ర పూజలు కలకలం..!

వర్ధన్నపేట‌లో క్షుద్ర పూజలు కలకలం..!

WGL: ఆధునిక యుగంలో క్షుద్ర పూజలు ప్రజలను ఇప్పటికీ వణికిస్తూనే ఉన్నాయి. క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు వర్ధన్నపేట పట్టణ శివారులోని ఎస్సారెస్పీ కెనాల్ కాలువపై ఆదివారం కలకలం రేపి పట్టణ ప్రజలను ఉలిక్కిపడేలా చేశాయి. ఎస్సారెస్పీ కెనాల్‌పై ఓ గొర్రె పొట్టేల్‌ని బలిచ్చి.. పసుపు, కుంకుమ, గుడ్లు పెట్టి క్షుద్ర పూజలు చేసినట్లు కనిపించాయి. దీంతో పట్టణ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.